: ఆసుపత్రిలో కాంపౌండర్ అయ్యే అర్హతే లేదు.. అయినా, ఆరోగ్య మంత్రిని అయ్యా: శత్రుఘ్న సిన్హా
ప్రముఖ సినీ నటుడు, రాజకీయవేత్త శత్రుఘ్న సిన్హా తన జీవిత కథ 'ఎనీథింగ్ బట్ కామోష్' పుస్తకంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన మొహం సినిమాలకు పనికిరాదని... ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలంటూ తొలినాళ్లలో పలువురు తనకు సూచించారని చెప్పారు. అయితే, దేవానంద్ మాత్రం అలాంటి పని చేయవద్దని సూచించారని తెలిపారు. సినీ పరిశ్రమలో తనను తాను నిరూపించుకోవడానికి, ప్రేక్షకులు తనను అంగీకరించడానికి ఎంతో కష్టపడ్డానని చెప్పారు. సినీ పరిశ్రమ తనకు ఎంతో ఇచ్చిందని అన్నారు.
తన రాజకీయ జీవితం గురించి మాట్లాడుతూ... ఆసుపత్రిలో కాంపౌండర్ అయ్యే అర్హత కూడా తనకు లేదని, అయినా ఆరోగ్య మంత్రిని కాగలిగానని శత్రుఘ్న సిన్హా తెలిపారు. సమాజానికి తన వంతు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.