: ఏపీకి ప్రత్యేక హోదానా.. నో ఛాన్స్: టీజీ వెంకటేష్‌


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్రత్యేక హోదా సాధ్యం కాదని పార్ల‌మెంటు స‌భ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ రోజు క‌ర్నూలు జిల్లాలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రానికి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ప్యాకేజీ మాత్రమే సాధ్యమని పేర్కొన్నారు. తాము ప్యాకేజీకి మ‌ద్ద‌తు ఇవ్వడానికి గ‌ల కార‌ణాన్ని గురించి ఆయ‌న వివరిస్తూ.. లోక్‌సభలో బీజేపీకి మెజారిటీ ఎక్కువగా ఉంద‌ని, అందుకే ప్యాకేజీ ప‌ట్ల సానుకూలంగా ఉన్నామ‌ని తెలిపారు. రాష్ట్రానికి అవ‌స‌ర‌మైన ప్యాకేజీని తాము తప్పకుండా సాధిస్తామని చెప్పారు. ఒకవేళ ఏపీకి సరిపడా ప్యాకేజీ అందకపోతే కేంద్ర స‌ర్కారుపై యుద్ధం చేస్తామ‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News