: ముస్లింలపై నిషేధానికి సౌదీ, అబుదాబి స్వయంగా మద్దతిచ్చాయి: వైట్ హౌస్
ఏడు దేశాల ముస్లింలను తమ దేశంలో కాలుమోపనీయకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి సంపన్న ముస్లిం దేశాల మద్దతు లభించింది. సిరియా, యమన్ వంటి దేశాల నుంచి అమెరికాకు వస్తున్న వారిని అడ్డుకోవడం సబబేనని, వారిని అమెరికాలో కాలు మోపనించి, ఇబ్బందులు పడటం కన్నా, ఆయా దేశాల్లోనే సేఫ్ జోన్ల పేరిట ప్రత్యేక ప్రాంతాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన మంచిదని సౌదీ అరేబియా, అబుదాబిలు అంగీకరించినట్టు వైట్ హౌస్ పేర్కొంది. ఆదివారం నాడు సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్, అబుదాబి ప్రిన్స్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ సహ్యాన్ లతో ట్రంప్ ఫోన్లో మాట్లాడారని, సేఫ్ జోన్ల ఏర్పాటు ద్వారా శరణార్థులను ఆదుకోవచ్చని ముగ్గురు నేతలూ అభిప్రాయపడ్డట్టు శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. ఇక ద్వైపాక్షిక సంబంధాలపైనా ట్రంప్ తన మిత్రులతో మాట్లాడారని తెలిపాయి.