: గాంధీ వర్ధంతి: హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా రెండు నిమిషాల పాటు ట్రాఫిక్ నిలిపివేత


భారత జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలో రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జి, ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఆయ‌న‌కు నివాళుల‌ర్పించారు. ఈ రోజు ఉద‌యం 11 గంట‌ల‌కు రెండు నిమిషాల పాటు దేశవ్యాప్తంగా మౌన ప్రదర్శన నిర్వహించాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో మౌన ప్రదర్శన నిర్వ‌హించారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా రెండు నిమిషాల పాటు ట్రాఫిక్ నిలిపివేశారు.

  • Loading...

More Telugu News