: ‘చెత్త ప్రదర్శన’ రికార్డు మూట‌గ‌ట్టుకున్న విరాట్ కోహ్లీ


ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న‌ మూడు టీ 20 మ్యాచ్‌ల‌లో భాగంగా నిన్న టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ 21 పరుగులు చేసి అవుటయిన విష‌యం తెలిసిందే. దీంతో విరాట్ కోహ్లీ ఓ చెత్త రికార్డును నెల‌కొల్పాడు. ఇప్పటివరకూ ఇంగ్లండ్ పై  విరాట్ కోహ్లీ ఎనిమిది ట్వంటీ 20ల్లో ఆడాడు. అయితే అన్నింటిలో క‌లిపి ఆయ‌న చేసిన సగటు 29.25 మాత్ర‌మే. దీంతో టీ20 ఫార్మాట్ల‌లో కోహ్లీ చెత్త ప్రదర్శనగా నమోదైంది. క్రీజులో అడుగుపెట్టిందే మొద‌లు బ్యాటును ఝళిపించే కోహ్లీ మిగతా ఏ జట్టుపై కూడా ఇంతటి చెత్త ప్రదర్శన చేయలేదు. ఇంగ్లండ్‌పై ఆయ‌న ఆడిన ఎనిమిది టీ20ల్లో ఆరుసార్లు 20కిపైగా పరుగుల్ని మాత్ర‌మే సాధించాడు. దీంతో ఆయ‌న త‌న కెరీర్‌లో అత్యంత చెత్త యావరేజ్ ను న‌మోదు చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News