: హైద‌రాబాద్‌లో దారుణం.. రూ.2500 కోసం గొంతు కోశారు!


నివసించడానికి ఇళ్లు లేక ఎంతో మంది నిరుపేద‌లు హైద‌రాబాద్‌లో రాత్రుళ్లు రోడ్ల‌పక్క‌నే ప‌డుకుంటార‌న్న విష‌యం తెలిసిందే. వారి వ‌ద్ద ఉన్న కొద్దిపాటి డ‌బ్బుని కూడా కాజేసేస్తున్నారు దొంగ‌లు. ఈ ప్ర‌య‌త్నంలోనే దుండ‌గులు రాత్రి రెండున్న‌ర సమయంలో ఓ వ్య‌క్తి గొంతుకోశారు. న‌గ‌రంలోని ఇసామియాబజార్‌కు చెందిన సాయికుమార్‌(23), కె.మహేశ్‌ (22), కువుపాటి రవి (23) ముగ్గురూ క‌లిసి రాత్రి వేళల్లో ఫుట్‌పాత్‌లపై నిద్రించే వారి వద్ద డబ్బులు దోచుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే నారాయణగూడలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న‌ అంగోతు గోపాల్‌ (25) జేబులో డ‌బ్బులు వెతికారు. వెంట‌నే మేల్కొన్న‌ గోపాల్ వారిని అడ్డుకున్నాడు. దీంతో గోపాల్‌పై సాయి కత్తితో అతని దాడిచేసి గొంతు కోశాడు. అనంత‌రం అత‌డి వ‌ద్ద ఉన్న రూ.2,500 తీసుకుని పారిపోయారు. స్థానికులు గోపాల్‌ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితులు ముగ్గురిని ప‌ట్టుకొన్నారు.

  • Loading...

More Telugu News