: బడ్జెట్ ను బహిష్కరిస్తున్నాం: మమతా బెనర్జీ
2016-17 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంటుకు సమర్పించే ఫిబ్రవరి 1వ తేదీన తమ పార్టీ ఎంపీలు హాజరు కావడం లేదని తృణమూల్ కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఆ రోజు సరస్వతీ పూజ ఉన్నందున తమ పార్టీ ఎంపీలు పార్లమెంటుకు రాబోరని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. నేడు జరిగే అఖిలపక్ష సమావేశానికి కూడా హాజరుకాబోమని ఆమె స్పష్టం చేశారు. కాగా, రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. రేపు మృతి చెందిన పార్లమెంట్ సభ్యులకు నివాళుల అనంతరం ఎల్లుండి బడ్జెట్ ను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సభ ముందు ఉంచనున్నారు. నోట్ల రద్దు తరువాత ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని తృణమూల్ కాంగ్రెస్ విమర్శిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ బడ్జెట్ ను బహిష్కరించాలని నిర్ణయించుకుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. బడ్జెట్ ను ముందుకు తీసుకురావడం, రైల్వే బడ్జెట్ ను సైతం సాధారణ బడ్జెట్ లో విలీనం చేయడం వంటి అంశాలనూ మమతా బెనర్జీ వ్యతిరేకించిన సంగతి తెలిసింద.