: నువ్వు ఇంగ్లిష్‌లో మాట్లాడగలవని నీలో ఓ దురహంకారం ఉంది: జగన్‌పై మంత్రి దేవినేని ఆగ్రహం
‘నువ్వు ఇంగ్లిష్‌లో మాట్లాడగలవని నీలో ఓ దురహంకారం ఉంది’ అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అవినీతి డబ్బుతో మీటింగులు పెట్టుకొని చంద్రబాబు నాయుడిని, ఏపీ ప్రభుత్వాన్ని అర్ధగంట లేదా గంట తిట్టడం, సాక్షి మీడియాలో వాటిని చూపించడం రోజు ఇదే వారి పని అయిపోతోందని విమర్శించారు. రైతులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని చెప్పారు. మరోవైపు రైతులను పట్టించుకోవడం లేదని జగన్ విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన అన్నారు. తాము చేస్తోన్న ప్రతి కార్యక్రమంపై అసత్య ప్రచారాలు చేయడమే జగన్ పనిగా పెట్టుకున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తోన్న జగన్ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని సూచించారు.