: నేను రాను బిడ్డో... పిడుగులాంటి విషయం చెప్పిన ములాయం


కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న కుమారుడు అఖిలేష్ యాదవ్ ముందు పిడుగులాంటి వార్త పేల్చారు ములాయం సింగ్ యాదవ్. ఈ పొత్తు అనైతికమని, దాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోనని స్పష్టం చేస్తూ, తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనేది లేదని తెలిపారు. ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా ఉండి కూడా పొత్తులు ఎందుకని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎంతో కాలం కేంద్రం అధికారంలో ఉండి కూడా ఎలాంటి అభివృద్ధీ చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ - సమాజ్ వాదీ కూటమికి వ్యతిరేకంగా పనిచేయాలని కార్యకర్తలను కోరనున్నట్టు పేర్కొన్నారు. పార్టీ నేతలను అఖిలేష్ దూరం చేసుకుంటున్నారని చెప్పారు. మాజీ మంత్రి నారద్ రాయ్ బీఎస్పీలో చేరిన విషయాన్ని గుర్తు చేస్తూ, నేతలను దూరం చేసుకుంటే ఓటమే మిగులుతుందన్న విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

  • Loading...

More Telugu News