: ఆధార్ కార్డుపై కీలక ప్రకటన చేసిన యూఐడీఏఐ


స్మార్ట్ / ప్లాస్టిక్ ఆధార్ కార్డులు మాత్రమే చెల్లుతాయని ప్రచారం చేస్తూ, వాటిని తయారు చేసి ఇచ్చేందుకు రూ. 200 వరకూ వసూలు చేస్తున్నారని వస్తున్న ఫిర్యాదులపై యూఐడీఏఐ స్పందించింది. ఎటువంటి ప్లాస్టిక్ ఆధార్ కార్డు అవసరం లేదని, డౌన్ లోడ్ చేసుకున్న పత్రం సరిపోతుందని తెలిపింది. మామూలు కాగితంపై డౌన్ లోడ్ చేసుకునే ఆధార్ ను అన్నింటికీ ధ్రువపత్రంగా వాడుకోవచ్చని, అది కలర్ లో ఉండాల్సిన అవసరం కూడా లేదని పేర్కొంది. స్మార్ట్ / ప్లాస్టిక్ పేరిట డబ్బులు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

  • Loading...

More Telugu News