: కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ పర్యటన వాయిదా


ఈ నెలాఖరులో జరగాల్సిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ, తిరుమల పర్యటన వాయిదా పడింది. తిరుమలలో అదే సమయంలో రథసప్తమి వేడుకల ఏర్పాట్లలో అధికారులు బిజీగా ఉండటం, ఖమ్మం పర్యటన నేపథ్యంలో మొక్కల చెల్లింపు పర్యటనను కేసీఆర్ తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. ఆరేళ్ల క్రితం తెలంగాణ ఉద్యమం సాగుతున్న వేళ, ప్రత్యేక తెలంగాణ సిద్ధిస్తే, తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి, విజయవాడ కనకదుర్గమ్మకు ఆభరణాలు చేయిస్తామని కేసీఆర్ మొక్కుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆభరణాలు తయారుకాగా, వాటిని తీసుకుని స్వయంగా కేసీఆర్ తిరుమలలో ఈ నెల 30న పర్యటిస్తారని తొలుత వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తిరిగి ఎప్పుడు కేసీఆర్ పర్యటన షెడ్యూల్ ఉంటుందన్న విషయం త్వరలో తెలియనుంది.

  • Loading...

More Telugu News