: మసీదులో కాల్పులకు తెగబడిన దుండగులు.. ఐదుగురి మృతి.. కెనడాలో దారుణం
కెనడాలోని క్యూబెక్ నగరంలోని ఓ మసీదులో దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో లోపలికి ప్రవేశించిన దుండగులు యథేచ్ఛగా కాల్పులు జరిపారు. ఆ సమయంలో మసీదులో 40 మంది ఉన్నారు. కాల్పుల ఘటనతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని మసీదు ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. కాల్పులు జరిపిన ఇద్దరు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.