: క‌డ‌ప జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురి దుర్మ‌ర‌ణం


క‌డ‌ప జిల్లా జ‌మ్మల‌మ‌డుగులో జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు దుర్మ‌రణం పాల‌య్యారు. వేగంగా వ‌స్తున్న కారు అదుపు త‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు పోలీసులు చెబుతున్నారు. ప్ర‌మాదంలో ముగ్గురు అక్క‌డ‌ిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా మ‌రో ఇద్దరు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరిని స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. వీరి ప‌రిస్థితి కూడా విష‌మంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. అతివేగ‌మే ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని ప్ర‌త్య‌క్ష సాక్షులు చెబుతున్నారు. మృతుల‌ను అశ్వ‌త్థామ‌, తుల‌సీరామ్‌, గోవ‌ర్థ‌న్‌లుగా గుర్తించారు. వీరికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంద‌ని  పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News