: నా కలల హీరోతో కలసి ఈ సినిమాలో నటించాను: మంచు మనోజ్


తన కలల హీరో రాజేంద్రప్రసాద్ తో కలిసి గుంటూరోడు సినిమాలో నటించానని మంచు మనోజ్ తెలిపాడు. హైదరాబాదులో నిర్వహించిన గుంటూరోడు ఆడియో వేడుకలో మనోజ్ మాట్లాడుతూ, తనకు ఎప్పటికీ ఫేవరేట్ హీరో రాజేంద్ర ప్రసాద్ అన్నాడు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని చెప్పాడు. ఆయనతో కలిసి నటించడం ఆనందంగా ఉందని చెప్పాడు. అలాగే ఈ సినిమా కథ అద్భుతంగా ఉందని అన్నాడు. సినిమా విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. తనకు రీల్, రియల్ లైఫ్ లో ప్రవీణ్ మంచి స్నేహితుడని మనోజ్ తెలిపాడు. 

  • Loading...

More Telugu News