: ధాంక్స్ మనోజ్.. నేను ప్రశాంతంగా ఉన్నాను!: శర్వానంద్
మంచు మనోజ్ ప్రాంక్స్ (ఆకతాయి పనులు) తట్టుకోవడం చాలా కష్టమని యువ నటుడు శర్వానంద్ తెలిపాడు. హైదరాబాదులో నిర్వహించిన గుంటూరోడు ఆడియో వేడుకలో మాట్లాడుతూ, మనోజ్ తన మనసుకు నచ్చినట్టు ఉంటాడని అన్నాడు. నచ్చితే చాలా బాగా ఉంటాడని, నచ్చకపోతే గెటౌట్ అంటాడని చెప్పాడు. టాలీవుడ్ లో మంచి ప్రాంక్స్ ప్లే చేస్తాడని తెలిపాడు. ఇప్పటివరకు తనపై అలాంటి ప్రాంక్స్ ప్లే చేయలేదని, అందుకే ఇంతవరకు ఆనందంగా ఉన్నానని చెప్పాడు. అఖిల్ చెప్పినట్టు మనోజ్ చాలా ఎనర్జటిక్ గా ఉంటాడని అన్నాడు. ఈ సీక్రట్ చెప్పినా, లేక కొంచెం ఎనర్జీ తమకు కూడా పంచినా బాగుంటుందని శర్వానంద్ అన్నాడు. ఈ సినిమాకు పాటలు తన స్నేహితుడే రాశాడని చెప్పాడు. తామంతా సెయింట్ మేరీస్ కాలేజీలో చదువుకున్నామని చెప్పాడు. అప్పట్నుంచే పాటలు రాసేవాడని, మంచి రచయిత అని అన్నాడు. వాడు పిలవడంతోనే తాను వచ్చానని అన్నాడు.