: అర్ధ సెంచరీతో రాణించిన కేఎల్ రాహుల్...టీమిండియా 126/4
నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ రాణించాడు. సహచరులంతా పెవిలియన్ బాటపడుతున్నా ధాటిగా బ్యాటింగ్ చేస్తూ భారత్ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. దూకుడే మంత్రంగా బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ప్రారంభంలోనే విరాట్ కోహ్లీ (21), రైనా (2), యువరాజ్ సింగ్ (40 పెవిలియన్ చేరారు. అంతవరకు జాగ్రత్తగా ఆడిన రాహుల్ ఒక్కసారిగా జూలు విదిల్చాడు. భారీ షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో కేవలం 47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో మొత్తం 71 పరుగులు చేశాడు. అనంతరం మనీష్ పాండే (30) కు మాజీ కెప్టెన్ ధోనీ (5) జతకలిశాడు. దీంతో టీమిండియా 17.2 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది.