: పీవీ సింధు ఖాతాలో మరో టైటిల్


ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు ఖాతాలో మరో టైటిల్ వచ్చి చేరింది. ఉత్తరప్రదేశ్ లోని లక్నో వేదికగా జరుగుతున్న సయ్యద్‌ మోదీ గ్రాండ్‌ ప్రీ టైటిల్‌ సింగిల్స్‌ బ్యాడ్మింటన్ విజేతగా ఆమె నిలిచింది. ఫైనల్స్ లో పీవీ సింధు ఇండోనేషియా క్రీడాకారిణి మరిస్కాపై 21-13, 21-14 తేడాతో విజయం సాధించింది. దీంతో సింధు ఖాతాలో మరో టైటిల్ చేరింది. 

  • Loading...

More Telugu News