: ఇలా చూపించాను.. అమితాబ్ అలా ఒప్పేసుకున్నారు: రానా


ఇంతవరకు ఎవరూ చేయని ప్రయత్నాన్ని తాను చేస్తున్నానని సినీ నటుడు రానా తెలిపాడు. వైజాగ్ లో జరిగిన చారిత్రాత్మక ఘటనను 'ఘాజీ' రూపంలో ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నానని రానా అన్నాడు. ఈ కథతో మనకు సంబంధం ఉంది కనుక తెలుగు, హిందీల్లో తీస్తున్నామని చెప్పాడు. ఈ సినిమా కథను తొలిసారి బాలీవుడ్ లో కరణ్ జోహర్ కి చెబితే, తానే చేస్తానన్నాడని చెప్పాడు. తరువాత ట్రైలర్ ను అమితాబ్ సర్ కి చూపించానని చెప్పాడు. ఆ సమయంలో ఈ సినిమాలో తన కోసం ఏ పాత్ర ఉందని అడిగారని, సర్ వాయిస్ ఓవర్ చెప్పాలని అడగ్గానే ఆయన సరే అని సంతోషంగా ఒప్పుకున్నారని చెప్పాడు. ఆ పార్ట్ తెలుగు వెర్షన్ కి చిరంజీవి, తమిళ వెర్షన్ కి సూర్య వాయిస్ ఓవర్ చెబుతున్నారని తెలిపాడు. ఈ సినిమా ప్రతి భారతీయుడ్ని, ప్రధానంగా తెలుగు వారిని కదిలిస్తుందని రానా అభిప్రాయపడ్డాడు. 

  • Loading...

More Telugu News