: తిరుమలలో చిన్నారి కిడ్నాప్ కలకలం


తిరుమలలో కిడ్నాప్ కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లా తూముచెర్లకు చెందిన మహాత్మ దంపతులు తమ ఏడాది కుమార్తెతో కలసి యాత్రికుల ఉచిత వసతి సముదాయానికి చేరుకున్నారు. అక్కడ వీరి బాలికను ముసుగు ధరించిన ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు. దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన పోలీసులు, పరిసరాల్లోని సీసీ టీవీ పుటేజ్ ను పరిశీలిస్తున్నారు. కాగా, ముసుగు ధరించిన వ్యక్తిని గుర్తించినట్టు తెలుస్తోంది. అతని కోసం గాలింపు ప్రారంభించారు. 

  • Loading...

More Telugu News