: సుబ్బరామిరెడ్డి మనవడి పెళ్లికి తరలివచ్చిన సినిమా తారలు!


బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున కుటుంబం, విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదితరులు హైదరాబాదు శివార్లలోని శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉన్న జీఎంఆర్ గ్రౌండ్స్ లో కలుసుకున్నారు. అక్కడ ప్రముఖ వ్యాపారవేత్త, ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి మనవడు కేశవ్, వీణ వివాహం జరిగింది. ఈ వివాహానికి సుబ్బరామిరెడ్డి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు. దీంతో గవర్నర్ నరసింహన్ దంపతులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్, సినీ ప్రముఖులు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. 

  • Loading...

More Telugu News