: చైతూ, సమంతల నిశ్చితార్థం నేడే!


టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత పట్టలేని సంతోషంగా ఉంది. దానికి కారణమేంటంటే... నేడు సమంత, నాగచైతన్యల నిశ్చితార్థం అని తెలుస్తోంది. చై, సమంతల నిశ్చితార్థం గురించి ఎలాంటి వార్త బయటకు పొక్కకుండా అక్కినేని కుటుంబం జాగ్రత్తపడింది. నిశ్చితార్థానికి కొన్ని గంటల ముందు తన ఇన్ స్ట్రా గ్రాంలో సమంత ఆనందంతో చిందులేస్తున్న వీడియోను పోస్టు చేసింది. ఆ సమయంలో తన మూడ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో విషయం అర్థం చేసుకున్న అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. చిన్న పిల్లలా డ్యాన్స్‌ చేస్తున్నావ్‌, నిన్ను అంత ఆనందంగా చూడటం చాలా ఆనందంగా ఉందంటూ ఆమె అభిమానులు కితాబునిచ్చారు. 'చై, నువ్వు మంచి జంట' అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News