: అమితాబ్, కొంత మంది స్నేహితులను చాలా క్లోజ్ గా ఫాలో అయ్యాను: హృతిక్ రోషన్
కాబిల్ సినిమా కోసం ఆరు రోజులు అమితాబ్ సర్ గొంతు అనుకరించేందుకు తీవ్రంగా ప్రయత్నించానని, రెండు రోజుల తరువాత ఆయన గొంతు పలికే విధానం నేర్చుకోగలిగానని, తరువాత స్నేహితులకు తన గొంతు వినిపించానని, వాళ్లు అభినందించారని, బాగా చేశానని చెప్పారని తెలిపాడు. దీంతో సినిమాలో అమితాబ్ గొంతును అనుకరించానని చెప్పాడు. అలాగే తాను కళ్ళు తెరిచి అంధుడిగా నటించడం వెనుక కొందరు స్నేహితులున్నారని చెప్పాడు. వారినే తాను అనుకరించానని, వారి గురించి తెలిస్తే తప్ప వారు అంధులని చెప్పలేమని అన్నాడు. కేవలం 60 రోజుల్లోనే సినిమా నిర్మించాలని నిర్మాత భావించారని, అది చేతల్లో చూపించారని చెప్పాడు. ఈ సినిమాతో చాలా విషయాలు నేర్చుకున్నామని హృతిక్ తెలిపాడు.