: ట్రంప్ బొమ్మకు తుపాకీ గురిపెట్టిన భారతీయ టీచర్ ను సస్పెండ్ చేసిన స్కూలు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఓ స్కూల్ లో భారతీయ సంతతి టీచర్ సరదాగా చేసిన పని చేష్ట ఆమె ఉద్యోగానికి ఎసరుపెట్టింది. దాని వివరాల్లోకి వెళ్తే... డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని అక్కడి లైవ్ ప్రసారాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో టెక్సాస్ లోని డల్లాస్ లో ఉన్న ఆడంసన్ హైస్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్న భారత సంతతికి చెందిన పాయల్ మోదీ, ట్రంప్ ప్రమాణ స్వీకారం లైవ్ టెలికాస్ట్ అవుతుండగా, స్కూల్ పిల్లలు వినియోగించే వాటర్ గన్ తీసుకుని స్క్రీన్ పై కనిపిస్తున్న ట్రంప్ చిత్రాన్ని కాలుస్తూ, చావు అంటూ అరిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో తీవ్రవిమర్శలపాలవుతోంది. దీంతో స్కూలు యాజమాన్యం ఆమెను సస్పెండ్ చేసింది.