: ట్రంప్ కి ఫోబియా ఉంది...అందుకే బ్రిటన్ ప్రధాని చేయిపట్టుకున్నారు
బ్రిటన్ ప్రధాని థెరిసా మే అమెరికా పర్యటన సందర్భంగా విడుదల చేసిన ఫోటోలు ఆ రెండు దేశాల్లో పెను కలకలం రేపాయి. ఈ ఫోటోల్లో ట్రంప్ వైట్ హౌస్ లో బ్రిటన్ ప్రధాని థెరిసా మే చేయి పట్టుకొని నడుస్తున్నట్టు ఉంది. దీంతో వారి మధ్య నున్న 'ఎక్స్‌ట్రా స్పెషల్ రిలేషన్ షిప్' కు కారణమేంటన్న ఆసక్తి అందర్లోనూ రేగగా, సోషల్ మీడియాలో సెటైర్లు మొదలయ్యాయి. వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావించిన ఆమె అధికార యంత్రాంగానికి సంబంధించిన అత్యున్నత వర్గాలు వివరణ ఇచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ కు బాత్మోఫొబియా ఉందని తెలిపారు. ఈ ఫోబియా ఉన్న వారు ఏటవాలు ప్రదేశాలు, దిగుడుగా ఉన్న ప్రదేశాలూ చూసినప్పుడు పడిపోతామేమోనని భయపడతారని, వైట్ హౌస్ లో కూడా ట్రంప్ ఒంపుగా ఉన్న ప్రదేశాల్లో థెరిసా మే సహాయం తీసుకున్నారని తెలిపారు. ఆ సందర్భంగా తీసిన ఫోటోలు అవని వారు వివరించారు.