: ప్రత్యేక హోదా కోసం మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం యోచనలో వైకాపా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ, బడ్జెట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ విషయాన్ని పార్టీ ఎంపీ మేకపాటి మీడియాకు తెలిపారు. ఈ ఉదయం వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగగా, పార్లమెంటులో పాటించాల్సిన వ్యూహంపై ప్రజా ప్రతినిధులు చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మేకపాటి, ప్రత్యేక హోదాపై చంద్రబాబు నవరసాలనూ పండిస్తున్నారని ఆరోపించారు. 5 కోట్ల మంది ప్రజల హక్కులను ఆయన కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రం బాగుపడాలంటే, హోదా కావాల్సిందేనని, మోదీ సర్కారుపై అవిశ్వాసం పెట్టాలంటే, తమ పార్టీ సంఖ్యాబలం తక్కువ కాబట్టి, ఇతర పార్టీల సహకారాన్ని కోరనున్నామని అన్నారు.