: ఏపీలో మొదలైన జల్లికట్టు పోటీలు... హాజరైన వైకాపా నేతలు
తమిళనాడుకు సరిహద్దు ప్రాంతమైన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డి పల్లెలో జల్లికట్టు పోటీలు వైభవంగా మొదలయ్యాయి. వైకాపా నేత భూమన కరుణాకరరెడ్డి సహా పలువురు నేతలు స్వయంగా హాజరై పోటీలను జరిపించారు. ప్రతి సంవత్సరమూ జిల్లాలోని పలమనేరు, కుప్పం, చంద్రగిరి, పాకాల, పుత్తూరు తదితర ప్రాంతాల్లో జల్లికట్టు సంప్రదాయబద్ధంగా సాగుతుందన్న సంగతి తెలిసిందే. కాగా, నేడు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యయి. తిరుచ్చి జిల్లా కరుంగళంలో నాలుగేళ్ల తరువాత తొలిసారిగా పోటీలు జరుగగా, పెద్దఎత్తున ప్రజలు హాజరయ్యారు.