: మలేషియాలో మాయమైన చైనా టూరిస్టుల బోటు
చైనా కొత్త సంవత్సరం వేడుకల శుభవేళ, మలేషియాలో పర్యటనకు వెళ్లిన చైనా బృందం ప్రయాణిస్తున్న బోటు అదృశ్యం కావడం కలకలం రేపింది. మొత్తం 28 మంది చైనా వాసులతో సహా 31 మందితో కూడిన బోటు పులావు మెంగలంకు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగిందని మలేషియా తీర ప్రాంత రక్షణ అధికారులు వెల్లడించారు. బోటు నీట మునిగి ఉండవచ్చని అనుమానిస్తున్నామని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో గాలింపు చర్యలు వేగంగా సాగడం లేదని వెల్లడించారు. కాగా, శనివారం నాడు సభా ప్రాంతంలోని కోట కినబాలు తీరం నుంచి ఈ పడవ బయలుదేరిందని, మార్గ మధ్యలో సంబంధాలు తెగిపోయాయని తీర ప్రాంత అధికారి ఒకరు తెలిపారు.