: మళ్లీ మొదలైన జాట్ల నిరసనలు... హర్యానాలో ఉద్రిక్తత
ప్రభుత్వ ఉద్యోగాలు సహా అన్ని విభాగాల్లో తమకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జాట్ వర్గీయులు మరోసారి నిరసనలకు దిగడంతో హర్యానాలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రాష్ట్రంలోని 19 జిల్లాల్లోనూ జాట్ వర్గీయులు ఈ ఉదయం నిరసన ప్రదర్శనలకు దిగారు. జాట్ ఆరక్షణ్ సంఘర్ష్ సమితి చీఫ్ జై సింగ్ పిలుపు ఇవ్వడంతో, తాజా నిరసనలను ముందుగానే ఊహించిన ప్రభుత్వం జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, రైల్వే స్టేషన్లకు 500 మీటర్ల దూరం వరకూ ఐదుగురు, అంతకు మించి వ్యక్తులు గుమికూడటాన్ని నిషేధించినా, నిరసనలకు మాత్రం అడ్డుకట్ట పడలేదు. పలు జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యగా పారామిలిటరీ దళాలను ప్రభుత్వం మోహరించింది. కాగా, గత సంవత్సరం ఇదే విధమైన నిరసనలకు జాట్ వర్గీయులు దిగిన వేళ, 30 మంది మరణించిన సంగతి తెలిసిందే.