: ట్రంప్ కు తొలి ఎదురు దెబ్బ... ఆదేశాలను నిలిపిన ఫెడరల్ జడ్జి


అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత దూకుడుగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ కు తొలి ఎదురు దెబ్బ తగిలింది. ట్రంప్ విధించిన ఇమిగ్రేషన్ బ్యాన్ ఆదేశాలను నిలుపుదల చేస్తున్నట్టు బ్రూక్లిన్‌ ఫెడరల్ న్యాయమూర్తి ప్రకటించారు. ఈ మేరకు అత్యవసర ఆదేశాలు జారీ చేస్తూ, చెల్లుబాటయ్యే వీసాలతో అమెరికా చేరుకున్నవారిని, తిరిగి వెనక్కు పంపించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి యాన్ డొన్నెల్లీ ఇచ్చిన ఈ ఆదేశాలతో నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఇరాక్, సిరియా, ఇరాన్, సూడాన్, లిబియా, సోమాలియా, యెమెన్ దేశాల నుంచి చెల్లుబాటయ్యే వీసాలతో వచ్చిన వారిని అడ్డుకోలేరు. ఇక శరణార్థ దరఖాస్తు పెట్టుకుని ఆమోదం పొందిన వారికి కూడా ఇదే నిర్ణయం వర్తిస్తుందని ఆమె స్పష్టం చేశారు. ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుతున్నట్టు డొన్నెల్లీ తెలిపారు. కాగా, వీసాలు, అన్ని డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నప్పటికీ, ఎయిర్ పోర్టుల్లో పలువురిని అడ్డుకోవడాన్ని అమెరికన్లే ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News