: ఎత్తుకు పైఎత్తు... అమెరికన్లపై ఇరాన్ ఆంక్షలు
ఏడు దేశాల ప్రజలను అమెరికాలోకి ప్రవేశించకుండా ట్రంప్ నిర్ణయం తీసుకున్న వేళ, ఇరాన్ దీటుగా స్పందించింది. ట్రంప్ ఎత్తుకు పైఎత్తు వేస్తూ, తమ దేశంలోకి అమెరికన్ల రాకను కఠినం చేస్తున్నట్టు ప్రకటించింది. ట్రంప్ చర్యలు ఇరాన్ వాసులను అవమానించాయని, ఇకపై ఇరాన్ కు రావాలని భావించే అమెరికన్లు కఠిన నిబంధనలను ఎదుర్కోవాల్సిందేనని ఇరాన్ విదేశాంగ మంత్రి జాదవ్ జరీఫ్ వ్యాఖ్యానించారు. ట్రంప్ నిర్ణయాలు తీవ్రవాదాన్ని, హింసను ప్రేరేపించేవేనని వెల్లడించిన జాదవ్, చరిత్రను వెనక్కు మళ్లించేలా ట్రంప్ నిర్ణయాలున్నాయని, భవిష్యత్తులో ఇరాన్ - అమెరికాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయన్న విషయం ఇప్పుడే చెప్పలేమని అన్నారు.