: సరబ్ జిత్ వ్యవహారంలో కేంద్రం తీరుపై కుటుంబ సభ్యుల ఆగ్రహం


పాకిస్థాన్ లోని జిన్నా ప్రభుత్వ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న భారత ఖైదీ సరబ్ జిత్ సింగ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంపై కుటుంబ సభ్యులు మండిపడ్డారు. సరబ్ పరిస్థితిపై తీవ్ర ఆవేదన చెందుతున్న భార్య, తల్లి, సోదరి.. కేంద్రం వైఖరి అభ్యంతరంకరంగా ఉందన్నారు. తక్షణమే సరబ్ జిత్ ను తీసుకురావలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో భారత ప్రభుత్వ అసమర్ధత బయటపడిందని సరబ్ సోదరి దల్బీర్ కౌర్ ఆరోపించారు. అజ్మల్ కసబ్, అఫ్జల్ గురులకు ఉరిశిక్ష వేసినందుకే తన సోదరుడిపై పాక్ ఈ దాడి చేసిందని ఆమె పేర్కొన్నారు.

కాగా, వైద్యులు ప్రకటించినట్టు సరబ్ వైద్య పరంగా మరణించలేదని, బ్రతకాలనుకుంటున్నాడనీ ఆమె అన్నారు. సరైన వైద్యం అందిస్తే కోలుకుని, దాడిచేసిన వారి గురించి చెబుతాడని దల్బీర్ చెప్పారు. సరబ్ మాట్లాడలేని స్థితిలో కోమాలో ఉన్నాడన్న అతని భార్య సుఖ్ ప్రీత్ కౌర్, తన భర్తను తిరిగి తీసుకురావాలని ప్రధాని మన్మోహన్, అధినేత్రి సోనియాగాంధీలకు విజ్ఞప్తి చేసింది. ఈ ఉదయం పాక్ నుంచి భారత్ చేరుకున్న వీరు సాయంత్రంలోగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా, హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, ప్రధానిని కూడా కలవనున్నారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News