: హీరో సూర్యకు క్షమాపణలు చెప్పిన పెటా
తన కొత్త చిత్రం 'ఎస్3' కోసమే జల్లికట్టును సమర్థిస్తూ హీరో సూర్య వ్యాఖ్యలు చేశాడని విమర్శించిన ది పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్ మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) ముఖ్య కార్య నిర్వహణాధికారిణి పూర్వా జోషిపురా ఎట్టకేలకు దిగొచ్చారు. తనపై విమర్శలు చేసిన జోషిపురాకు హీరో సూర్య తన న్యాయవాది ద్వారా కోర్టు నోటీసులు పంపించడంతో, ఆమె స్పందించారు. క్షమాపణలు కోరుతూ లేఖ రాశారు. తన వ్యాఖ్యలు బాధించి ఉంటే మన్నించాలని కోరారు. కాగా, తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు సూర్య మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. మెరీనా బీచ్ లో యువత నిరసన ప్రదర్శనకు దిగిన వేళ ఆయన స్వయంగా వచ్చి నిరసనల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.