: వెంకన్నకు కోటి రూపాయిల విలువైన ఆస్తిని రాసిచ్చిన భక్తుడు


ఆపదమొక్కుల వాడికి కోటి రూపాయల విలువైన ఆస్తిని రాసిచ్చాడో భక్తుడు. తిరుపతికి చెందిన అంచ బసవపున్నయ్య అనే భక్తుడు, కొర్లగుంటలో తనకున్న మూడంతస్తుల భవనాన్ని స్వామివారికి అందించారు. భవన రిజిస్ట్రేషన్ పత్రాలను తిరుమల తిరుపతి దేవస్థానం  ఈఓ సాంబశివరావుకు అందించారు. మార్కెట్ విలువ ప్రకారం భవనం విలువ కోటి రూపాయల వరకూ ఉందని ఈ సందర్భంగా బసవపున్నయ్య తెలిపారు. ఇదే సమయంలో తొట్టంబేడు మండలంలో తనకున్న 222 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని కూడా స్వామివారికి సమర్పించినట్టు ఆయన తెలిపారు. దీని విలువ రూ. 5 లక్షలని వెల్లడించారు.

  • Loading...

More Telugu News