: ఇప్పుడు మేఘాలయ మంత్రి వంతు.. బాలికను అత్యాచారం చేసిన నిందితుల్లో హోంమంత్రి?
మేఘాలయ హోంమంత్రి హోర్జు డోంకుపర్ రాయ్ అత్యాచార ఆరోపణల్లో చిక్కుకున్నారు. 14 ఏళ్ల బాలికపై ఆయన అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. షిల్లాంగ్‌లోని మార్వలీన్స్ ఇన్‌పేరిట హోం మంత్రి తనయుడు ఓస్బర్ట్ రిమ్మీ ఓ గెస్ట్‌హౌస్ నిర్వహిస్తున్నారు. అందులో 14 ఏళ్ల బాలికను నలుగురు వ్యక్తులు వేర్వేరుగా అత్యాచారం చేశారు. వారిలో హోమంత్రి రాయ్ ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన రాజీనామా కోసం ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే ఆ ఆరోపణలు అవాస్తవమని, తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని రాయ్ తేల్చి చెబుతున్నారు. అటువంటి తప్పు తాను చేయనని, ఆ గెస్ట్ హౌస్‌ను తాను నిర్వహించడం లేదని రాయ్ పేర్కొన్నారు. వాస్తవాలను వెలికి తీసే విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఉందని, పూర్తి స్థాయిలో విచారణ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. రాజ్‌భవన్‌ను అమ్మాయిల క్లబ్‌గా మార్చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న ఆ రాష్ట్ర గవర్నర్ షణ్ముగనాథన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.