: స్నేహితుల కంటే శత్రువులే గొప్పంటూ అమితాబ్ ట్వీట్‌కు వర్మ రీట్వీట్!
గత మూడు నాలుగు రోజులుగా వరుస ట్వీట్లతో మీడియాలో చక్కర్లు కొడుతున్న సంచలన దర్శకుడు వర్మ తాజాగా మరో ట్వీట్ చేశాడు. అయితే ఈసారి రాజకీయ పార్టీల మీద, నాయకుల మీద కాదు. స్నేహితులు, శత్రువుల మధ్య తేడాను వివరిస్తూ ట్వీటాడు. జీవితంలో విజయం సాధించాలంటే మంచి స్నేహితులు ఉండాలని, అదే అద్భుతమైన విజయం సాధించాలంటే మాత్రం శక్తిమంతమైన శత్రువులు ఉండాలంటూ బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీటుపై స్పందించిన వర్మ స్నేహితులు వెన్నుపోటు పొడుస్తారని, అదే శత్రువులైతే ఎదురుగా వచ్చి దాడికి దిగుతారని పేర్కొన్నాడు. స్నేహితుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కూడా కష్టమని పేర్కొన్నాడు.