: నా ఫేవరేట్ ఫెదరరే అంటున్న దాదా


ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో తన ఫేవరేట్ రోజర్ ఫెదరర్ అని టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. గత కొంత కాలంగా పేలవ ఫాంతో టైటిల్ పోరుకు చేరకుండానే ఇంటిముఖం పడుతున్న టెన్నిస్ దిగ్గజాలు రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ లు మరోసారి ముఖాముఖి తలపడనుండడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెన్నిస్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ గాయాలను జయించి మంచి ఆటతీరు ప్రదర్శించడం అందర్లోనూ ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో తన ఫేవరేట్ ఫెదరరేనని గంగూలీ పేర్కొన్నాడు.

టీమిండియాలో మూడేళ్ల విరామం తరువాత పునఃప్రవేశం చేసిన యువరాజ్ సింగ్, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మంచి ఫాంలో ఉన్నారని, రెండో టీ20లో భారత్ దే విజయమని దాదా ఆశాభావం వ్యక్తం చేశాడు. రెండో టీ20లో ఎలాంటి మార్పులుండవని తాను భావిస్తున్నానని అన్నాడు. మరోసారి కోహ్లీ ఓపెనర్ గా వస్తాడని దాదా చెప్పాడు. 

  • Loading...

More Telugu News