: యువతిని ఢీ కొట్టిన రవీంద్ర జడేజా కారు!
టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా, తనా భార్య రీవా సోలంకితో పాటు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు గురైంది. గుజరాత్ లోని జామ్ నగర్ జిల్లాలో జడేజా దంపతులు ప్రయాణిస్తున్న కారు ఓ మోపెడ్ ను ఢీకొట్టింది. దీంతో మోపెడ్ పై ప్రయాణిస్తున్న ప్రీతి శర్మ అనే యువతి గాయపడింది. వెంటనే జడేజా ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించాడు. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయని, ప్రస్తుతానికి ఆమె క్షేమంగా ఉందని చికిత్స చేసిన వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై జడేజా దంపతులు కానీ, బాధిత యువతి కానీ స్పదించలేదు. కాగా, జడేజాకు నిశ్చితార్థం సందర్భంగా తన అత్తింటివారు ఆడి క్యూ7 కారును బహుమతిగా అందజేసిన సంగతి తెలిసందే. టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న జడేజా భార్యతో కలిసి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం.