: యూపీలో బీజేపీకి హిందు యువ వాహిని సంస్థతో కొత్త తలనొప్పి!


ఉత్తరప్రదేశ్‌ లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతూ, రాష్ట్రం మొత్తాన్ని చుట్టేస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు షాకిచ్చే అనుభవం ఎదురవుతోంది. ఆ పార్టీకి చెందిన ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌ కు చెందిన హిందు యువ వాహిని (హెచ్‌వైవీ) తిరుగుబావుటా ఎగురవేస్తోంది. యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్‌ ను ప్రకటించని పక్షంలో ఉత్తరప్రదేశ్‌ లోని తూర్పు ప్రాంతంలోని మొత్తం 64 నియోజకవర్గాల్లో తామే అభ్యర్థులను నిలబెడతామని హెచ్‌వైవీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే దీనిని ఆ సంస్థ వ్యవస్థాపకులు, ఎంపీ ఆదిత్యనాథ్‌ ఖండించారు. అయినా హెచ్‌వైవీ వెనుకడుగు వేయడం లేదు.

అంతేకాకుండా బీజేపీకి వ్యతిరేకంగా ఆ ప్రాంతంలోని ఆరు నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్పందించిన ఆదిత్యనాథ్‌ తాను బీజేపీలోనే ఉన్నానని, బీజేపీకే తన పూర్తి మద్దతని అన్నారు. హెచ్ వైవీకి ఎన్నికల్లో పోటీచేసే అధికారం లేదని, అదొక సాంస్కృతిక సంస్థ అని, దానికి కొన్ని నియమాలు ఉన్నాయని ఆయన అన్నారు. వాటికి విరుద్ధంగా ప్రకటనలు చేస్తే చర్యలు తీసుకుంటానని ఆయన కార్యకర్తలను హెచ్చరించారు. కాగా, ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు తలపట్టుకుని కూర్చున్నారు. 

  • Loading...

More Telugu News