: రేపటి మ్యాచ్ పై ధోనీతో కుంబ్లే మంతనాలు!


టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో కోచ్ అనిల్ కుంబ్లే మంతనాలాడాడు. ఇంగ్లాండ్‌ పై రెండో టీ20 నేపథ్యంలో ఓటమి తప్పించుకునేందుకు ఎలాంటి వ్యూహం అమలు చేస్తే బాగుంటుందో వారిద్దరూ చర్చించారు. విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో భారత్‌ జట్టు ప్రాక్టీస్‌ సెషన్‌ సందర్భంగా అనిల్‌ కుంబ్లే, మహేంద్రసింగ్‌ ధోని మధ్య ప్రత్యేక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ధోనీ కుంబ్లేకు పలు సూచనలు చేశాడు.

బ్యాటింగ్ ఆర్డర్, బౌలింగ్ వనరులు, ఫీల్డ్ సెటప్, ఇంగ్లండ్ అనుసరించే వ్యూహాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. కాగా, జట్టుకు విరాట్‌ కోహ్లి సారథ్యం వహిస్తున్నప్పటికీ, మైదానంలో కోహ్లి, మైదానం బయట కుంబ్లే, జట్టు మేనేజ్‌ మెంట్‌ ధోని సలహాలు తీసుకుంటున్నాయి. రేపటి మ్యాచ్ లో కోహ్లీ, రైనా, యువరాజ్, ధోనీల బ్యాటింగ్, భువనేశ్వర్, నెహ్రా, చాహల్, అమిత్ మిశ్రాల రాణింపుపై జట్టు విజయం ఆధారపడి ఉన్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News