: చరిత్ర నెలకొల్పిన సెరేనా విలియమ్స్!
ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సెరెనా విలియమ్స్ సొంత అక్కపై గెలిచి చరిత్ర సృష్టించింది. నేడు జరిగిన ఫైనల్స్ లో మరోసారి సోదరి వీనస్ విలియమ్స్ పై 6-4, 6-4 తేడాతో వరుస సెట్లను గెలుపొంది టైటిల్ ను సొంతం చేసుకుంది. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ఏడోసారి సాధించిన మహిళగా చరిత్ర పుటల్లో తన స్థానం పదిలపరుచుకుంది. తద్వారా మొత్తం 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకున్న అతివగా సెరెనా నిలిచింది. ఈ సందర్భంగా ఆసక్తికర అంశం ఆవిష్కృతమైంది. ఫైనల్లో తలపడిన సెరేనా, వీనస్ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు కావడంతో విజయం సాధించిన అనంతరం ఇద్దరూ ఆనందాన్ని పంచుకున్నారు. దీంతో సెరేనా ఇంతవరకు స్టెఫీ గ్రాఫ్ (22) పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్ల విజేతగా రెండో స్థానంలో ఉన్న రికార్డును అధిగమించింది. దీంతో సెరేనా కంటే ముందు 24 టైటిళ్లతో ఆస్ట్రేలియాకు చెందిన రిటైర్డ్ క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ నిలిచింది.