: మైదానం పెద్దగా ఉంటే నా పని సులువవుతుంది: చాహల్
మైదానం పెద్దగా ఉంటే తన పని సులువవుతుందని టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ తెలిపాడు. సాధారణంగా మైదానం చిన్నగా ఉంటే ప్లెటెడ్ డెలివరీ సంధిస్తే దానిని బౌండరీ లైన్ దాటించడం సులభమని అన్నాడు. అదే గ్రౌండ్ పెద్దగా ఉంటే ఊరించే ప్లెటెడ్ డెలివరీని భారీ షాట్ ఆడేందుకు ఆటగాళ్లు ప్రయత్నిస్తారని, ఏమాత్రం అవకాశమున్నా బంతి గాల్లోకి లేస్తుందని, తద్వారా వికెట్లు తీసే అవకాశం ఉంటుందని చెప్పాడు. రెండో టీ20లో ఇంగ్లండ్ ఆటగాళ్లపై తాను ప్లెటెడ్ డెలవరీలనే ప్రయోగిస్తానని చెప్పాడు. నాగ్ పూర్ లోని విదర్భ స్టేడియం పెద్దగా ఉందని, దీంతో బ్యాట్స్ మన్ ను ఊరించే ప్లెటెడ్ డెలివరీలను నమ్ముకున్నానని తెలిపాడు. కాగా, తొలి టీ20లో కూడా చాహల్ రాణించిన సంగతి తెలిసిందే. రెండో టీ20లో చాహల్ కు జోడీగా అమిత్ మిశ్రా బౌలింగ్ కు దిగనున్న సంగతి తెలిసిందే.