: బ్రెగ్జిట్ స్పూర్తితో అమెరికాలో రగులు కొంటున్న కలెగ్జిట్!


భారతదేశంలో కొత్త పోరాటాలకు జల్లికట్టు ఉద్యమం ఎలా స్పూర్తిగా నిలిచిందో అలాగే, దేశాలుగా విడిపోవడానికి బ్రెగ్జిట్ స్పూర్తిగా నిలుస్తోంది. తాజాగా, బ్రెగ్జిట్ స్పూర్తితో విడిపోతామంటూ కాలిఫోర్నియా పోరాటానికి సిద్ధమవుతోంది. చాలా కాలంగా యూఎస్ నుంచి విడిపోతామంటూ కాలిఫోర్నియా పోరాడుతోంది. అయితే గతంలో జరిపిన పోరాటాలన్నీ విఫలమయ్యాయి. ట్రంప్ బాధ్యతలు చేపట్టిన అనంతరం యూఎస్ అవలంబించే విధానాలు తమకు ఆమోదయోగ్యంగా ఉండవని భావిస్తున్న కాలిఫోర్నియా వాసులు యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడిపోయిన 'బ్రెగ్జిట్‌' పదం స్పూర్తితో 'కలెగ్జిట్‌' అనే సరికొత్త పోరాటానికి నాంది పలుకుతున్నారు.

'కలెగ్జిట్‌' కు ప్రజల మద్దతుపై 'యస్‌ కాలిఫోర్నియా ఇండిపెండెన్స్‌ క్యాంపెయిన్‌' గ్రూప్‌ సంతకాలు సేకరించనుందని స్టేట్‌ సెక్రటరీ అలెక్స్‌ పడిల్లా ప్రకటించారు. దీంతో 'కలెగ్జిట్‌'కు బ్యాలెట్‌ నిర్వహించేందుకు అవసరమైన సుమారు 6 లక్షల సంతకాలను జులై 25 నాటికి సేకరించనున్నారు. ట్రంప్ విధానాలతో యూఎస్ నుంచి కాలిపోర్నియా తప్పుకోవడం ఖాయమేనని పరిశీలకులు పేర్కొంటున్నారు. 

  • Loading...

More Telugu News