: విమానంలో గుండెపోటుకు గురైన మహిళ మృతి
రాజస్థాన్‌లోని రాజ్‌కోట్ ఎయిర్‌పోర్టు నుంచి ఈ రోజు ఉదయం ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన విమానంలో ఓ మహిళకు గుండెపోటు వచ్చింది. సదరు మహిళ తన భర్తతో కలిసి ప్రయాణిస్తోంది. అయితే, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆమె గుండెపోటుతో బాధపడింది. ఈ విషయాన్ని తెలుసుకొని వెంటనే అప్రమత్తమైన పైలట్లు, ఫ్లైట్‌ను సంగనీర్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అయితే, అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించి, ఆమెకు చికిత్స అందేలోపే ఆమె మృతి చెందింది. ఆమె పేరు సీమా అని సంబంధిత అధికారులు తెలిపారు.