: చెన్నై తీరంలో పెట్రోలియం నింపుకున్న రెండు నౌకలు ఢీ


చెన్నై కామరాజార్ పోర్టుకు అత్యంత సమీపంలో రెండు నౌకలు ఢీకొన్నాయి. ఈ రెండు నౌకలు పెట్రోలియం ఉత్పత్తులను నింపుకుని ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) లోడుతో పోర్టు నుంచి బయటకు వెళుతున్న ఎంటీబీడబ్ల్యూ మేపిల్ రవాణా నౌక ఎదురుగా వచ్చిన ఎంటీ డాన్ అనే నౌకను ఢీకొట్టింది. డాన్ నౌకలో పెట్రోలియం ఆయిల్ లూబ్రికెంట్లు ఉన్నాయి. ఈ ప్రమాదం గురించి కామరాజార్ పోర్ట్ అథారిటీ ఛైర్మన్ భాస్కరాచార్ మీడియాకు తెలిపారు.

ఈ ప్రమాదం నేపథ్యంలో, పెట్రోలియం ఉత్పత్తులు లీకై ఉంటే పెను సమస్య వచ్చి ఉండేది. రవాణాకు అంతరాయం ఏర్పడటమే కాకుండా, లక్షలాది సముద్ర జీవుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉండేది. రెండు నౌకలను తీరానికి తీసుకువచ్చి పరిశీలించామని భాస్కరాచార్ తెలిపారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని చెప్పారు. మేపిల్ నౌక యథావిధిగా తన గమ్యస్థానానికి బయలుదేరిందని... డాన్ నౌకలోని పెట్రోలియం ఉత్పత్తులను అన్ లోడ్ చేయించామని తెలిపారు.

  • Loading...

More Telugu News