: చంద్రబాబు ఇలాకాలో బంగారం శుద్ధి చేసే కర్మాగారం


ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో బంగారం శుద్ధి చేసే కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నారు. రూ. 300 కోట్లతో ఈ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆస్ట్రేలియన్ ఇండియా రిసోర్స్ కంపెనీ సీఈఓ హనుమప్రసాద్ తెలిపారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సుకు హాజరైన ఆయన... ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. గత ఏడాది జరిగిన ఇదే సదస్సులో కూడా రూ. 300 కోట్లతో కర్నూలులో ఇలాంటి ప్రాజెక్టుకే ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నామని చెప్పారు. మరో రెండు నెలల్లో ఆ ఫ్యాక్టరీ పని చేయడం ప్రారంభిస్తుందని తెలిపారు.

  • Loading...

More Telugu News