: యాదగిరిగుట్టలో అదృశ్యమైన బాలుడిని కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో గుర్తించిన పోలీసులు


యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో నిన్న రాత్రి 12 ఏళ్ల అర్షిత్ అనే బాలుడు కనిపించకుండా పోయాడు. తమ ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ బాలుడు చీకటిపడుతున్నా తిరిగి రాకపోవడంతో తీవ్ర ఆందోళన చెందిన అతడి తాత స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అర్షిత్ కోసం గాలించి చివ‌రికి ఆ బాలుడి ఆచూకీని గుర్తించారు. ఆ బాలుడిని ఈ రోజు ఉద‌యం కొత్తగూడెం రైల్వేస్టేషన్‌లో గుర్తించామ‌ని పోలీసులు తెలిపారు. 

  • Loading...

More Telugu News