: ప్రభుత్వానికి దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలి: సీపీఎం ఏపీ కార్యదర్శి మధు


ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు చేపట్టిన ఉద్యమాన్ని టీడీపీ ప్రభుత్వం సహించలేక పోతోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. ఉద్యమకారులు, విద్యార్థులపై తప్పుడు కేసులను బనాయిస్తోందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని, ఉద్యమకారులను కేంద్ర మంత్రి సుజనా చౌదరి పందులతో పోల్చడం అనాగరికమని చెప్పారు. హోదా వచ్చేంత వరకు అన్ని పార్టీలు కలసి పోరాడుదామని పిలుపునిచ్చారు.

మరోవైపు, విశాఖపట్నంలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సు బోగస్ అంటూ మధు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి నిజంగా దమ్ముంటే... పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు విజయవాడలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మధు పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News