: దర్శకుడు భన్సాలీపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి: హృతిక్‌ రోషన్‌, అనుష్క శర్మ, కరణ్‌ జొహార్‌


రాజస్థాన్‌లోని జయపురలో జయ్‌గఢ్‌ కోట వద్ద చారిత్రక సినిమా ‘పద్మావతి’ షూటింగ్‌ జరుగుతుండగా ఆ సినిమా దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీపై రాజ్‌పుత్‌ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు నిన్న దాడికి దిగిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో రాణి పద్మావతికి సంబంధించి వాస్తవాలను వక్రీకరిస్తున్నారంటూ వారు ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డారు. ఈ దాడిని బాలీవుడ్ ప్ర‌ముఖులు ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. హృతిక్‌ రోషన్‌, అనుష్క శర్మ, సోనమ్‌ కపూర్‌, ఆలియా భట్‌, కరణ్‌ జొహార్‌, ఫర్హాన్‌ అక్తర్‌, రిషి కపూర్‌, ప్రియాంక చోప్రా, ప్రీతీ జింతా, సోహా అలీఖాన్ తో పాటు ప‌లువురు సినీ ప్రముఖులు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు ట్వీట్లు చేశారు. ఇటువంటి సమయాల్లోనే ఇండస్ట్రీ ఐక్యంగా ఉండాలని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News