: మహిళా లెక్చరర్లకు అసభ్య మెసేజ్ లు పంపిన వ్యక్తి అరెస్ట్
మహిళా లెక్చరర్లకు మొబైల్ ఫోన్ ద్వారా అశ్లీల మెసేజ్ లు పంపిన సెక్యూరిటీ గార్డును బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు, మల్లేశ్వరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో మహేంద్ర అనే యువకుడు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఇదే కాలేజ్ లో చదువుతున్న ఓ విద్యార్థి ఫోన్ ద్వారా నలుగురు మహిళా లెక్చరర్లకు అశ్లీల మెసేజ్ లు పంపించాడు. దీంతో, అవాక్కయిన సదరు మహిళా లెక్చరర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు... ఆ సెల్ ఫోన్ ఓ విద్యార్థిదని గ్రహించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా... అశ్లీల మెసేజ్ లు పంపింది సెక్యూరిటీ గార్డు అని తేలింది. దీంతో, అతడిని అరెస్ట్ చేశారు.