: అమిత్ షా వార్నింగ్ తో లైన్లోకి వచ్చిన యడ్యూరప్ప, ఈశ్వరప్ప!


బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వార్నింగ్ తో కర్ణాటక బీజేపీ అగ్ర నేతలు యడ్యూరప్ప, కేఎస్ ఈశ్వరప్ప లైన్లోకి వచ్చారు. తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనబెట్టి, రాజీకి వచ్చారు. కన్నడ పోరాట యోధుడు సంగోలి రాయన్న సంస్మరణార్థం నిర్వహించనున్న కార్యక్రమాలను ఉమ్మడిగా నిర్వహించేందుకు అంగీకరించారు. పార్టీకి అతీతంగా సంగోలి రాయన్న బ్రిగేడ్ పేరుతో కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించేందుకు ఈశ్వరప్ప సిద్ధమవడంతో.. బీజేపీలో ముసలం పుట్టింది. ఈశ్వరప్ప నిర్ణయాన్ని యెడ్యూరప్ప వ్యతిరేకించారు. దీంతో, ఇరువురు నేతల మధ్య విభేదాలు తలెత్తాయి.

ఈ నేపథ్యంలో అమిత్ షా రంగంలోకి దిగారు. పార్టీ సంప్రదాయలకు అనుగుణంగానే నేతలు పనిచేయాలని... లేకపోతే పార్టీకి గుడ్ బై చెప్పి, వెళ్లిపోవచ్చని హెచ్చరించారు. దీంతో, ఇద్దరు నేతలు రాజీకి వచ్చారు.

  • Loading...

More Telugu News